శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (16:14 IST)

హైదరాబాద్ అమ్మాయిని అలా మోసం చేసి.. బార్‌లో ఇలా దొరికిపోయాడు..?

బెంగళూరులో మందు తాగి హంగామా చేసి ఓ అత్యాచార నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు నాగార్జున (30). ఇతడు తన భార్య, కుమారుడితో క

బెంగళూరులో మందు తాగి హంగామా చేసి ఓ అత్యాచార నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు నాగార్జున (30). ఇతడు తన భార్య, కుమారుడితో కలిసి బెంగళూరులోని మారతహళ్ళిలో నివాసం వుంటున్నాడు.

అయితే పీకలదాక మద్యం సేవించిన నాగార్జున బార్‌లో సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తే పోలీసులు షాక్ అయ్యారు. అతనో అత్యాచార నిందితుడని పోలీసులు కనుగొన్నారు. 
 
హైదరాబాదుకు చెందిన ఓ మహిళతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్న నాగార్జున ఆమెను మోసం చేసి.. వేరొక అమ్మాయిని వివాహం చేసుకుని బెంగళూరులో సెటిల్ అయినట్లు తేలింది. భర్తతో విడాకులు తీసుకుని కుమారుడితో వున్న మహిళను పెళ్లి పేరిట మోసం చేసి.. ఆమెను లోబరుచుకున్నాడు. బాధితురాలు హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ కేసు కింద అప్పట్లో పోలీసులకు చిక్కకుండా పారిపోయిన నాగార్జున ప్రస్తుతం పోలీసులకు దొరికిపోయాడు. శారీరకంగా హైదరాబాద్ అమ్మాయిని వాడుకుని.. పెళ్లి మాటెత్తే సరికి పారిపోయిన నాగార్జునను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.