శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:28 IST)

శివ శివా... విద్యార్థినిపై శివాలయంలో గ్యాంగ్ రేప్

కామంతో కళ్ళు మూసుకునిపోయిన కామాంధులకు బడి, గుడి అనే తేడాలేకుండా పోతోంది. తాజాగా ఓ కామాంధులు ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన

కామంతో కళ్ళు మూసుకునిపోయిన కామాంధులకు బడి, గుడి అనే తేడాలేకుండా పోతోంది. తాజాగా ఓ కామాంధులు ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, అతను రావడంలో జాప్యం జరిగింది. దీంతో స్థానికంగా ఉండే బస్టాప్‌లో కూర్చుంది. 
 
దీన్ని గమనించిన ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి.. ఇక్కడ సేఫ్ కాదని.. సమీపంలో ఉన్న గుడిలోకి వెళ్లి కూర్చోమని సలహా ఇచ్చాడు. అది నమ్మిన ఆమె గుడిలోపలికి వెళ్లింది. ఆ అజ్ఞాతవ్యక్తి తన ఇద్దరు స్నేహితులకు సైగ చేయడంతో వాళ్లు కూడా ఆలయంలోకి వెళ్లారు. వారంతా కలిసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. 
 
ఈ ఘటన నుంచి తేరుకున్న ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రేప్ చేసిన ముగ్గురిలో ఒకరికి బైక్ ఉంది. ఆ బైక్‌పై సంజు బాబా అనే స్టిక్కర్ ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. సంజయ్ పటేల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతనివద్ద జరిపిన విచారణలో అసలు నిజం వెల్లడించాడు. చేసిన నేరాన్ని అంగీకరించడమే కాకుండా, మిగిలిన ఇద్దరు కామాంధుల పేర్లను కూడా వెల్లడించాడు. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.