శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By preeti
Last Modified: బుధవారం, 3 జనవరి 2018 (14:25 IST)

పురుషాంగం ఆకృతిలో అత్యంత అరుదైన శివలింగం... ఎక్కడ?

ప్రపంచంలోని పురాతనమైన శివలింగాలలో ఒకటి ఈ పురుష అంగం ఆకృతిలో ఉన్న శివలింగం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలోని పరుశురామేశ్వరుని ఆలయంలో ఈ భిన్నమైన శివలింగం ఉంది. స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని వధించి మళ్

ప్రపంచంలోని పురాతనమైన శివలింగాలలో ఒకటి ఈ పురుష అంగం ఆకృతిలో ఉన్న శివలింగం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలోని పరుశురామేశ్వరుని ఆలయంలో ఈ భిన్నమైన శివలింగం ఉంది. స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని వధించి మళ్లీ తండ్రి వరంతోనే ఆమెను బ్రతికించుకుంటాడు. కానీ ఆయన తన తల్లిని చంపినందుకు బాధపడుతూనే ఉండేవాడు. ఆ తరుణంలో మునుల సలహా మేరకు శివుడిని ఆరాధించడానికి వెళ్తుండగా అడవి మధ్యలో ఈ శివలింగాన్ని దర్శించుకున్నాడు. అక్కడే ఒక సరోవరం ఏర్పాటు చేసుకున్నాడు. 
 
ప్రతిరోజూ అందులో ఒక్క పువ్వు మాత్రమే పూచేది, దానితో పూజ చేసేవాడు. అయితే అడవి జంతువుల కారణంగా ఈ పుష్పానికి హాని జరుగుతుందేమోనని కాపలాగా యక్షుడిని నియమించారు. ఆయన బ్రహ్మ భక్తుడు. ఒకరోజు పరుశురాముడు వచ్చేలోగానే యక్షుడు పుష్పంతో లింగానికి పూజ చేసాడు. పుష్పం లేకపోయేసరికి కోపోద్రిక్తుడై పరశురాముడు యుద్ధం ఆరంభించాడు. ఆ యుద్ధం పధ్నాలుగేళ్లు సాగింది. 
 
అప్పుడు ఆ ప్రదేశంలో పల్లం ఏర్పడినందున దీనికి గుడిపల్లం పేరు వచ్చింది. ఈ యుద్ధం ఎంతకీ ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారివురినీ శాంతపరిచి రెండుగా విచ్ఛిన్నమై ఇద్దరిలో కలిసిపోతాడు. అందుకే ఇక్కడ ఒక ఆకారం పరుశురాముడి చేతిలో వేటాడిన మృగంతోటి, రెండవది చేతిలో ఒక కల్లుకుండ, చిత్రసేనుడి ముఖం రూపంతో మలచబడిందని ఒక కథనం. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్టించబడిన శివలింగం మనిషి రూపంలో వేటిగాడి వలె ఉంటుంది. ఇక్కడ స్వామికి యజ్ఞోపవేతం లేకపోవడం మరో ప్రత్యేకత.