శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:05 IST)

నిరాశకు లోనవుతున్నారా? ద్రాక్ష పండ్లను తినండి..

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలట.

బుద్ధిమాద్యం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ద్రాక్షలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ద్రాక్ష పండ్లు ఎంతో మెండుగా పనిచేస్తాయి. 
 
అలాగే నిరాశ, నిస్పృహలకు గురయ్యే వారు ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్స్‌లో ఉపయోగించాలి. చిరాకు పడేవాళ్లు.. నిత్యం పని ఒత్తడితో సతమతమయ్యేవాళ్లు ద్రాక్షలను తప్పకుండా తీసుకోవాల్సిందే. పండ్ల రసంగా, లేదంటే ద్రాక్షలను అలాగే తీసుకున్నా ఫలితం పొందవచ్చు. కనీసం వారానికి రెండుసార్లైనా ద్రాక్ష పండ్ల రసాన్ని సేవించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.