శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (09:57 IST)

రివ్యూ రిపోర్ట్ : ఆలోజింపజేసే ''రాజరథం''

రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల గురించిన సమస్యను ప్రేమకథ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం తాము అవినీతిలో కూరుకుపోయినప్పుడు దాన్నుంచి ప్రజల్ని ఎలా డైవర్ట్‌ చేయాలనేది ఆసక్తిక

నటీనటులు : నిరుప్‌ బండారి, అవంతిక శెట్టి, ఆర్య తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : విల్లియమ్‌ డేవిడ్‌, సంగీతం : అనుప్‌ బండారి, నిర్మాత : అజయ్‌ రెడ్డి, విష్ణు, అంజు, సతీష్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : అనుప్‌ బండారి, ఎడిటర్‌ : షనత్‌ కుమార్‌.
 
నిరుప్‌ బండారి, అవంతిక శెట్టిలు జంటగా రానా దగ్గుబాటి వాయిస్‌ ఓవర్‌తో నిరుప్‌ సోదరుడు అనుప్‌ బండారి తెరకెక్కించిన చిత్రం 'రాజరథం'. కన్నడ చిత్రానికి అనువాదమిది. విడుదలకు ముందు పబ్లిసిటీతో హోరెత్తించిన ఈ చిత్రంలో ఏముందో చూద్దాం.
 
కథ :
హీరో అభి (నిరుప్‌ బండారి) కాలేజీ చదువు అయిపోయి బెంగుళూరుకు బస్‌ ఎక్కి జర్నీ చేస్తుంటాడు. ఆ బస్‌ పేరు రాజరథం. మధ్య మధ్యలో కొన్ని పాత్రలు ప్రవేశిస్తాయి. వాటికి అభికి లింక్‌ ఏమిటనేది వాయిస్‌ ఓవర్‌తో హీరో రానా చెబుతుంటాడు. ఈ క్రమంలో కాస్త ముందుకు, వెనక్కు కథ సాగుతుంది. ఇంజనీరింగ్‌ మొదలయ్యేప్పుడే తన కాలేజ్‌ అమ్మాయి మేఘ శ్రీధర్‌ (అవంతిక శెట్టి)ను ప్రేమిస్తాడు అభి.

కానీ నాలుగేళ్లు గడిచినా తన ప్రేమను ఆమెకు చెప్పలేకపోతాడు. దాంతో అతని ప్రేమ తెలీక మేఘ వేరొకరి ప్రేమలో పడుతుంది. అలా కోర్సు ముగించుకుని నిరుత్సాహంతో బెంగుళూరు బయలుదేరిన అతనికి మేఘ శ్రీధర్‌ బస్సులో ఎదురవుతుంది. ఆ ప్రయాణంలో వారిద్దరి మధ్య పరిచయం బాగా పెరుగుతుంది. వీరి ప్రేమకు రాజకీయ ఇష్యూ ఏవిధంగా ముడిపడి వున్నదనేది మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ:
రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల గురించిన సమస్యను ప్రేమకథ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం తాము అవినీతిలో కూరుకుపోయినప్పుడు దాన్నుంచి ప్రజల్ని ఎలా డైవర్ట్‌ చేయాలనేది ఆసక్తికరంగా చూపించాడు. ఇందుకు మీడియా ప్రముఖు వ్యక్తి కూడా వారికి తోడయి సలహాలు ఇవ్వడం వంటి విషయాలన్నీ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టినట్లు చూపించాడు. తాను చెప్పబోయే పాయింట్‌ను ఆలోజింపజేసేలా చెప్పే ప్రయత్నంలో  ఓ జంటను కలిపే ప్రయత్నంలో కాస్త కన్‌ఫ్యూజ్‌ కూడా క్రియేట్‌ చేశాడు దర్శకుడు. దాంతో స్క్రీన్‌ప్లే ముందుకూ, వెనక్కు వెళుతుంది. ఇది కొత్తగా అనిపించినా సగటు ప్రేక్షకుడు ఆస్వాదించే స్థాయిలో లేదనే చెప్పాలి.
 
ఇక దర్శకుడు అనుప్‌ బండారి, సినిమాటోగ్రఫర్‌ విల్లియమ్‌ డేవిడ్‌ ఇద్దరూ కలిసి ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా రూపొందించారు. సినిమా నడిచే ప్రతి లొకేషన్‌ ఎంతో అందంగా ఉంది. ఇక సినిమా కథను బస్సు వివరించిన తీరు బాగానే ఉంది. ఇక హీరో హీరోయిన్ల ప్రేమ కథకు బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికి గతంలో సంబంధం ఉండటం అనే అంశం బాగుంది. నిరుప్‌ బండారి కథానాయకుడి పాత్రలో బాగానే నటించాడు. బస్‌ జర్నీలోని పాత్రలతో దర్శకుడు జనరేట్‌ చేసిన ఫన్‌ కొంతవరకు పండింది. 
 
అయితే కథను చెప్పడం ఆరంభించిరన దర్శకుడు దానికి అనేక ఉప కథలను జోడించి ముగింపును వేరే రకంగా ఇవ్వడంతో సినిమా ఆసాంతం కన్ఫ్యూజన్‌, నీరసం కలిగాయి. లవ్‌ ట్రాక్‌కు జలవివాదాల ఇష్యూ తోడయి.. గందరగోళంగా వుంటుంది. మొదటి భాగం వరకు కథేమిటో ఎవ్వరికీ ఏమీ అర్థంకాదు. సెకండాఫ్‌లో ముడి విప్పుతాడు గనుక తెలియడానికి అవకాశముంది
 
కానీ బస్‌ మధ్యలో దిగిపోయిన హీరోహీరోయిన్లు అటవీ అందాల్ని చూసినా.. ఆ తర్వాత హీరోయిన్‌కు ఏమయిందో.. ఎలా బయటపడిందే అర్థంకాదు. ఆ తర్వాత సాయికుమార్‌ సోదరుడు రవి పాత్ర ఏమిటో క్లారిటీగా తెలీదు. కన్నడ మాతృక కావడంతోనూ హీరో పాత్ర ఎలివేషన్‌ కోసం కొన్ని సార్లు ఎక్కువగా వాడేయటంతో బోర్‌ కొట్టేసింది. నిర్మాతలు పెట్టిన ఖర్చు స్క్రీన్‌ మీద కనబడింది.
 
రేటింగ్‌: 5కు 2.75