శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (18:03 IST)

పాత కథకు గ్రామీణ అందాలు 'నెల్లూరి పెద్దారెడ్డి' రివ్యూ

సతీష్‌ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్‌ హీరో హీరోయిన్లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం 'నెల్లూరి పెద్దారెడ్డి'. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్

సతీష్‌ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్‌ హీరో హీరోయిన్లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం 'నెల్లూరి పెద్దారెడ్డి'. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైటిలే ఆసక్తిగా వున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
గ్రామానికి సర్పంచ్‌ అయిన నెల్లూరి పెద్దారెడ్డి (సతీష్‌ రెడ్డి) గ్రామ ప్రజలకు దేవుడులాంటివాడు. కానీ భార్యను అస్సలు పట్టించుకోడు. దానికీ ఓ కారణం లేకపోలేదు. అలాంటి సమయంలో బతుకుతెరువు కోసం వచ్చిన మీనాక్షి (మౌర్యాని)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిపోతుంది. విషయం తెలిసిన పెద్దారెడ్డి భార్య ముంతాజ్‌ కోపంతో రగిలి పోయి మీనాక్షిని చంపించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా కథ.
 
విశ్లేషణ:
నెల్లూరి పెద్దారెడ్డి పాత్రలో సతీష్‌ రెడ్డి ఫర్వాలేదనిపించాడు. గ్రామ పెద్దగా, భార్యపై అసహనం వున్న వ్యక్తిగా నటించాడు. మౌర్యానీ, ముంతాజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను గ్రామీణ ప్రాంతాల్లోని ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెప్పించారు. సమ్మెట గాంధీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
 
ముఖ్యంగా బాలసుబ్రమణి అందించిన ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గ్రామీణ అందాలను తన కెమెరాలో బంధించి ఎంతో సుందరంగా కనిపించేలా చేశాడు. గురురాజ్‌ సంగీతం కూడా ఫరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు విజే రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో వుండే ముతక డైలాగ్‌లు సంభాషణలు నేటివిటీకి తగినట్లుగా చూపించాడు. అయితే తను రాసుకున్న కథను మరింత జాగ్రత్తగా స్క్రీన్‌ ప్లే పరంగా ఆకట్టుకునే విధంగా తీస్తే బాగుండేది.