శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (14:38 IST)

కొత్త ప్రయత్నం 'ప్రతిక్షణం' (మూవీ రివ్యూ)

దర్శకుడు నాగేంద్రప్రసాద్‌ 2011లో జగపతిబాబుతో 'కీ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. జర్నలిస్టు మూలా నుంచి వచ్చిన తన పరిశోధన నేపథ్యంలో 2009లో వచ్చిన 'ఎగ్జామ్‌' అనే హాలీవుడ్‌ సినిమాను రీమేక్‌గా చేశారు.

నటీనటులు: మనీష్‌బాబు, తేజస్విని, దేవరాజ్‌, ఆర్చన, విజయసాయి, వైవా హర్ష, సుదర్శన్‌రెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు.
 
కెమెరా: కణ్యాణ్‌ సమీ, సంగీతం: రఘురాం, ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, ఆర్ట్‌: రవిచంద్ర. నిర్మాత: జి. మల్లికార్జునరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నాగేంద్రప్రసాద్‌.
 
దర్శకుడు నాగేంద్రప్రసాద్‌ 2011లో జగపతిబాబుతో 'కీ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. జర్నలిస్టు మూలా నుంచి వచ్చిన తన పరిశోధన నేపథ్యంలో 2009లో వచ్చిన 'ఎగ్జామ్‌' అనే హాలీవుడ్‌ సినిమాను రీమేక్‌గా చేశారు. ఆ తర్వాత గ్యాప్‌ తీసుకుని ఈసారి 'ప్రతిక్షణం' అనే చిత్రాన్ని రూపొందించారు. కన్నడలో జి.మల్లికార్జున రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగులో అనువాదమైంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
నిత్య (తేజస్విని) ఓ సబ్జెక్ట్‌పై రీసెర్చ్‌ చేసే విద్యార్థిని. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆమెను మేనమామ మల్లికార్జున రెడ్డి సంరక్షణలోనే ఉంటుంది. ఇక తను మేజర్‌ అయ్యాక ఆస్తిని ఆమెకి ఇచ్చేస్తున్నట్లు చెప్పడంతోనే.. తన తండ్రికోరిక మేరకు అనాథ ఆశ్రమానికి రాసేస్తానని చెబుతోంది. ఇదిలావుండగా, లంకంత ఇంటిలో ఒక్కతే ఉండటంతో ఆమెను ఎవరో కొందరు వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. అప్పటికే మనీష్‌బాబు (సత్య)ను ఆమె ప్రేమిస్తుంది. ఆమె ప్రవర్తనలో వింతమార్పులు రావడంతో సైక్రియాటిస్ట్‌ దేవరాజ్‌ దగ్గరకు వెళతాడు. ఆయన తన పరిశీలనలో ఆమెకు 'టాటాగ్రాఫిక్‌ ఫినామియా డిజార్డర్‌' అనే జబ్బు ఆమెకు ఉందనీ.. చిన్నతనంలో జరిగిన సంఘటన ఆమెను అలా మార్చేశాయని విశ్లేషిస్తాడు. ఆ తర్వాత సత్యకు ఏం చేయాలో చెబుతాడు? అది ఏమిటి? సత్య ఏం చేశాడు? నిత్య చిన్నతనంలో ఏం జరిగింది? అన్నది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ట్రైలర్‌, టీజర్‌లో ఆసక్తిని కల్గించిన ప్రతిక్షణం సినిమా ప్రేక్షకుల్ని థియేటర్‌కు రాబట్టేలా చేసింది. కథలోని అంశం కొత్తగా వుంటుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరిగా ఫీలయ్యే అమ్మాయిలో మానసికంగా వచ్చిన మార్పే ఈ కథకు మూలం. ఒంటరిగా వున్నప్పుడు తనను ప్రేమించివారే, తన స్నేహితులే తనను హత్యచేయాలని చూస్తున్నారని భ్రమించడం ఈ రోగ లక్షణం. ఇది 2007లో జర్మనీలో ఓ మహిళకు జరిగిందనీ, దాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు నాగేంద్ర కథను రాసుకుని ఉండవచ్చు. ఇందులో సత్య చేసిన నటన ఆకట్టుకుంటుంది. మనీష్‌బాబు తెలుగువారికి కొత్తవాడైనా ఓకే అనిపిస్తాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులుగా విజయసాయి, వైవా హర్ష, సుదర్శన్‌రెడ్డి కన్పిస్తారు. వారు చేసే కామెడీ కాస్త నవ్విస్తుంది. ఇక మాటలపరంగా పంచ్‌లు లేకుండా కథప్రకారం దర్శకుడు రాసుకున్నాడు. నిత్య మేనమామగా నిర్మాత నటించాడు.
 
ఈ చిత్రానికి కళ్యాణ్‌సమీ కెమెరా పనితనం బాగుంది. ప్రకృతి అందాలతోపాటు సన్నివేశపరంగా బాగా తెరకెక్కించాడు. థ్రిల్లర్‌ తరహాలో సాగిన ఈ చిత్రానికి గాయకుడు రఘురాం సంగీతాన్ని సమకూర్చడం విశేషం. సాహిత్యపరంగా, సన్నివేశపరంగా 'జరిగింది జాబిలి..' పాట చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. నటి అర్చన ప్రత్యేక సాంగ్‌లో అలరిస్తుంది. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రానికి నిర్మాణపు విలువలు ఓకే. మానసిక అంశాన్ని ఆసక్తికరంగానూ, భయపెట్టే విధంగా తీయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దానికి సంబంధించిన చిన్నపాటి లాజిక్కులను వదిలేశాడు. మొత్తంగా చూసుకుంటే ఓకే అనిపించేలా వుందీసినిమా.