పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?
ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకునే కాలం వచ్చింది. అలోపతి కంటే ఆయుర్వేదం, పెరటి వైద్యంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. పోషకాహారం తీసుకునే విషయంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజూ వివిధ మంచి అలవాట్లను అనుసరిస్తున్నారు. వారిలో కొందరు ప్రతి ఉదయం వ్యాయామం చేస్తారు.
మరికొందరు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన పానీయాలు తాగుతారు. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పానీయాలు ఉన్నాయి. వాటిలో దాల్చిన చెక్క పాలు. దాల్చిన చెక్క ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యం. రోజువారీ వంటలలో మసాలాగా ఉపయోగించే ఈ దాల్చిన చెక్కలో పోషకాల సంపద ఉంటుంది. ఈ పోషకాలను పొందడానికి, మనం దాల్చిన చెక్కను అనేక విధాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఈ పాలు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, అనేక ప్రయోజనాలను పొందవచ్చు. గోరు వెచ్చని పాలలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడిని చేర్చి.. పరగడుపున తాగడం వల్ల.. శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, శరీరానికి విశ్రాంతిని పొందవచ్చు.
అలాగే రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగితే, మీకు మంచి నిద్ర వస్తుంది. ఇంకా దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి వివిధ వ్యాధులను ఇది దూరం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది.
అంతేకాకుండా, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్క పాలు తాగితే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లలో ఏవైనా మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంపై దాడి చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ఇంకా మీ శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని మీరు భావిస్తే, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దాల్చిన చెక్క పాలు తాగండి. ఈ పాలు రోజూ ఒక గ్లాసు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది తరచుగా జలుబు, ఫ్లూ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.