శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (11:23 IST)

గోవాలో రేణూ దేశాయ్.. ఆయన పంపే మెసేజ్‌లను చూడనివ్వట్లేదు.. ప్రైవసీ లేదు..

నటి రేణూ దేశాయ్‌ రెండో పెళ్లికి త్వరలో ముహూర్తం ఖరారు కానుంది. ఇటీవల చేతిలో చెయ్యేసి ఓ ఫోటోను షేర్ చేసి తనకు ఓ జీవిత భాగస్వామి దొరికారంటూ స్పష్టం చేసిన రేణూ దేశాయ్.. తాజాగా తన పిల్లలు, స్నేహితులతో కలి

నటి రేణూ దేశాయ్‌ రెండో పెళ్లికి త్వరలో ముహూర్తం ఖరారు కానుంది. ఇటీవల చేతిలో చెయ్యేసి ఓ ఫోటోను షేర్ చేసి తనకు ఓ జీవిత భాగస్వామి దొరికారంటూ స్పష్టం చేసిన రేణూ దేశాయ్.. తాజాగా తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో విహరిస్తున్నారు. అయితే తన స్నేహితులు తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లు చదివే ప్రైవసీని ఇవ్వడంలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ దేశాయ్ తెలిపారు. 
 
ఈ మేరకు స్విమ్‌ డ్రెస్‌లో ఫోన్‌ చూస్తున్నప్పుడు తీసిన ఫొటోను రేణూ పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోను తన స్నేహితులు తీశారట. అయితే ఆ సమయంలో తాను తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లను చదువుతున్నానని, కానీ తన స్నేహితులు ఫొటోలు తీస్తూ తనకు ప్రైవసీ ఇవ్వడంలేదని రేణూ దేశాయ్ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే రేణూ దేశాయ్ పెళ్లి పీటలెక్కనుందని తేలిపోయింది. 
 
అయితే తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరును, ఫోటోను రేణూ దేశాయ్ వెల్లడించలేదు. ఇంకా గోవాలో రేణూ కుమార్తె ఆద్య బీచ్ ఒడ్డున ఆడుకున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.