శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (08:37 IST)

పవన్ ఫ్యాన్స్‌కు రేణూ దేశాయ్ షాకింగ్ వార్నింగ్... ఎందుకు?

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ వార్నింగ్ ఇచ్చారు. తన కుమారుడు అకీరాను ఏ ఒక్కరు కూడా జూనియర్ పవర్ స్టార్ అని పిలవవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా అల

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ వార్నింగ్ ఇచ్చారు. తన కుమారుడు అకీరాను ఏ ఒక్కరు కూడా జూనియర్ పవర్ స్టార్ అని పిలవవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా అలా పిలిస్తే వారి ఖాతాలాను బ్లాక్ చేస్తానంటూ హెచ్చరించారు.
 
ఇదే అంశంపై సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న అకీరా ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రేణూ దేశాయ్… ఈ ఫోటోకి ఎవరైనా జూనియర్ ప‌వ‌ర్‌స్టార్ అని కామెంట్ పెడితే వారిని బ్లాక్ చేసేస్తానని తెలిపింది. అకీరాని జూనియర్ పవర్‌స్టార్ అని పిలిచినా అతడి తండ్రికి, నాకు, అతడికి కూడా ఇష్టం ఉండదని, ఎవ్వరూ అలా పిలవవద్దని కోరింది. ఇది యూరోపియ‌న్ సినిమాలోని సీరియ‌స్ పాత్ర‌లోని లుక్ అని, తన ల్యాప్‌టాప్‌లో ఓ గేమ్ చూస్తున్న సమయంలో తీసిన ఫోటో అని తెలిపింది. 
 
అయితే కొన్ని రోజుల క్రితం నీలో నాకు కావల్సినంత ప్రేమ దొరికింది, నీతో ఉంటే ఆ సంతోషాన్ని చెప్పలేను, నా చెయ్యి ఇలాగే పట్టుకో… ఎప్పటికీ విడువకు. అవును ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావంటూ ఒకరి చేయి పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసింది. దీంతో రేణూదేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని అందరూ భావించినప్పటికీ రేణూదేశాయ్ మాత్రం దానిపై స్పందించలేదు.