శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: మంగళవారం, 19 జూన్ 2018 (14:38 IST)

జూనియర్ పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా... ఇదే వార్నింగ్: రేణూ దేశాయ్ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రాంలో ఒకరి చేయి పట్టుకుని వున్న ఫోటోను తీసి దాన్ని పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ చేయి ఎవరిదంటూ చాలామంది ప్రశ్నలు వేసినా రేణూ దేశాయ్ నుంచి సమాధానం మాత్రం రాలేదు. ఐతే తాజాగా మరో ఫోటో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రాంలో ఒకరి చేయి పట్టుకుని వున్న ఫోటోను తీసి దాన్ని పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ చేయి ఎవరిదంటూ చాలామంది ప్రశ్నలు వేసినా రేణూ దేశాయ్ నుంచి సమాధానం మాత్రం రాలేదు. ఐతే తాజాగా మరో ఫోటో పోస్ట్ చేసింది. ఐతే ఆ ఫోటో తన కుమారుడు అకీరా నందన్‌ది. 

ఆ ఫోటో కింద ఆమె ఇలా రాసుకుంది. నా త‌న‌యుడు ఈరోపియ‌న్ సినిమాలోని సీరియ‌స్ పాత్ర‌లా కనిపిస్తున్నాడు కదూ. త‌న ల్యాప్‌టాప్‌లో ఓ గేమ్ చూస్తున్న టైంలో నేను తీసిన ఫోటో ఇది. ఒక్కటి మాత్రం హెచ్చరిస్తున్నా. ఈ ఫోటోకి ఎవ‌రైన జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని కామెంట్ పెట్టారో అంతేసంగతులు. వారి పోస్ట్‌ని డిలీట్ చేయ‌డంతో పాటు బ్లాక్ చేసేస్తా. జూనియర్ పవర్ స్టార్ అని అకీరాని ఎవరు పిలిచినా అతడి తండ్రికి, నాకు, అతడికి కూడా ఇష్టం వుండదు. కాబట్టి అలా పిలవద్దు అని హెచ్చరించింది.
 
కాగా ఈమధ్య రేణూ దేశాయ్ ఒకరి చేయి పట్టుకుని ఓ కామెంట్ పెట్టింది. అదేమిటంటే... "నీలో నాకు కావల్సినంత ప్రేమ దొరికింది. నీతో ఉంటే ఆ సంతోషాన్ని చెప్పలేను. నేను చాలా శాంతంగా ఉంటాను. నా చెయ్యి ఇలాగే పట్టుకో... ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు'' అంటూ రాశారు. ఈ కవిత, ఆ ఫోటో చూస్తుంటే ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్లే అనిపిస్తోంది.
 
గతంలో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు రేణూ దేశాయ్ బహిరంగంగానే చెప్పారు. ఎన్నాళ్లిలా ఒంటరిగా వుండాలి. నాకూ ఓ తోడు కావాలి అని ఆమె వ్యాఖ్యానించారు. తనను తన పిల్లల్ని చూసుకునేందుకు ఓ వ్యక్తి అవసరమని ఆమె వెల్లడించారు. రెండో పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించగానే అప్పట్లో నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు చేశారు. ఐతే ఆ వ్యాఖ్యలను రేణూ దేశాయ్ కొట్టిపారేశారు. కాగా ఇప్పటి పోస్టుపై మాత్రం ఆమెకు నెగిటివ్ పోస్టులు, వ్యాఖ్యలు వస్తున్నట్లుగా కనబడలేదు. కాబట్టి త్వరలోనే రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం ఖాయం అని అనుకోవచ్చు.