సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (18:52 IST)

అకీరాకు మెగా హీరోల శుభాకాంక్షలు.. రేణూ దేశాయ్ భావోద్వేగం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ 14వ పుట్టినరోజును ఆదివారం (ఏప్రిల్ 8)న జరుపుకున్నాడు. అకీరాకు బర్త్ డే విషెస్ చెప్తూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ 14వ పుట్టినరోజును ఆదివారం (ఏప్రిల్ 8)న జరుపుకున్నాడు. అకీరాకు బర్త్ డే విషెస్ చెప్తూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. అలాగే సామాజిక మాధ్యమాలు వేదికగా అకీరాకు పవన్ ఫ్యాన్స్, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
అలాగే మెగా కుటుంబ హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లు అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అకీరాకు మెగా హీరోల నుంచి శుభాకాంక్షలు రావడంపై రేణూ దేశాయ్‌ భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడిపై చూపిస్తున్న ఆదరాభిమానులకు తనకు చెప్పలేనంత ఆనందంగా వుందని ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. అందరికీ తన లిటిల్ బర్త్ డే బోయ్ తరపున థ్యాంక్స అన్నారు. 
 
అకీరా పెద్దవాడవుతున్నా.. తల్లిగా తనకు మాత్రం ఎప్పటికీ చిన్నారిగా భావిస్తానని.. తల్లి, తండ్రి తరపున గొప్ప వ్యక్తులున్న కుటుంబంలో అకీరా జన్మించాడని.. అలాంటి గొప్పవారి నుంచి శుభాకాంక్షలు రావడం సంతోషంగా వుందని రేణూ దేశాయ్ చెప్పారు.