బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (10:23 IST)

పవన్ ఏమైపోయారు.. బీజేపీకి మద్దతిచ్చి నన్ను విమర్శిస్తారా?: చంద్రబాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన విమర్శలు రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. అప్పటి నుంచి టీడీపీ నేతలు.. పవన్‌పై విమర్శనాస్త్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన విమర్శలు రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. అప్పటి నుంచి టీడీపీ నేతలు.. పవన్‌పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పవన్‌ను వదిలిపెట్టలేదు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే, చర్చకు అవసరమైన సభ్యుల కోసం ఢిల్లీకి వెళ్లి ఇతర పార్టీలతో చర్చలు జరిపి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ ఏమైపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ బీజేపీకి అనుకూలంగా మారి తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. హోదా కోసం పార్టీలన్నీ ఏకం కావాలని సంకేతాలు పంపినా.. ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 
 
తన తొలి అఖిలపక్ష సమావేశానికి హాజరైన కాంగ్రెస్, రెండో సమావేశానికి రాలేదని, ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.