శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (11:43 IST)

"రంగస్థలం" చిత్రంలో 'ఎంత చక్కగున్నావే' పాట మేకింగ్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". గత నెల30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కె. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామలక్ష్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". గత నెల30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కె. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, చిట్టిబాబుగా రామ్ చరణ్ నటించారు. పంచాయతీ ప్రెసిడెంట్‌గా జగపతిబాబు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారు. 
 
అలాగే, ఈచిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగగా, పాటలు కూడా అలాంటి వాతావరణంలోనే తీశారు. దీంతో పాటలు కూడా మంచి ప్రేక్షకాధారణ పొందాయి. ముఖ్యంగా జిగేల్ రాణి, ఎంత చక్కగున్నావే వంటి పాటలకు అద్ఫుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఎంత చక్కగున్నావే పాట మేకింగ్ వీడియోను ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. ఆ వీడియో మీకోసం.