శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (14:35 IST)

ఈ సెల్ఫీ స్పెషల్ అంటోన్న నాగచైతన్య- సమంత దంపతులు

ఈ సెల్ఫీ స్పెషల్ అంటున్నారు.. సమంత, నాగచైతన్య దంపతులు. చైతూసమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేకిచ్చి ఫారిన్ ట్రిప్పేశారు. ఈ ట్రిప్పులో ఓ సెల్ఫీని స్పెషల్ అంటూ పోస్ట్ చేశారు. ముఖ్యంగా తమ మధ్య ప్రేమ చిగ

ఈ సెల్ఫీ స్పెషల్ అంటున్నారు.. సమంత, నాగచైతన్య దంపతులు. చైతూసమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేకిచ్చి ఫారిన్ ట్రిప్పేశారు. ఈ ట్రిప్పులో ఓ సెల్ఫీని స్పెషల్ అంటూ పోస్ట్ చేశారు. ముఖ్యంగా తమ మధ్య ప్రేమ చిగురించిన న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కు వద్ద వారిద్దరూ ఓ సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
 
సాధారణంగా సెల్ఫీలంటే ఇష్టముండదని.. కానీ ఈ సెల్ఫీకి మాత్రం మినహాయింపు ఉందని సమంత పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితం తమ మధ్య ప్రేమ ఇక్కడే చిగురించిందని సమంత వెల్లడించింది. ఆ మ్యాజిక్‌కు థ్యాంక్స్ అని ట్వీట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోని పోస్టు చేసింది. మరోవైపు చైతూ కూడా ఇదే ఫొటోని తన అకౌంట్‌లోనూ పోస్టు చేశాడు. 
 
కాగా, 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏ మాయ చేసావె' చిత్రంలో వారిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌ను ఈ సెంట్రల్ పార్కులో నిర్వహించారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ గతేడాది అక్టోబరులో వివాహ బంధంగా మారింది. కాగా సమంత తాజాగా నటించిన రంగస్థలం బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.