గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (19:21 IST)

వైజాగ్ ఆర్కే బీచ్‌లో ''రంగస్థలం'' ప్రీ-రిలీజ్.. బుర్రకథ, డప్పు వాద్యాలతో?

రామ్ చరణ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రంగస్థలం'' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎంతసక్కగున్నావే, రంగా రంగస్థలం రెండు పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా రంగమ్మా.

రామ్ చరణ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రంగస్థలం'' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎంతసక్కగున్నావే, రంగా రంగస్థలం రెండు పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా రంగమ్మా.. మంగమ్మా అంటూ మూడో సాంగ్‌‌ను మైత్రీ మూవీ మేకర్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 
 
ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు యూనిట్ వేదిక ఖరారు చేసింది. మార్చి 30వ తేదీన రంగస్థలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఈ నెల 18వ తేదీన నిర్వహించాలని యూనిట్ నిర్ణయించింది. ఇందుకోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ వేదికపై దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టనుంది. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బుర్రకథ, తప్పెటడుగు, చోడవరం డప్పు వాద్యాల ప్రదర్శనలు వుంటాయని తెలుస్తోంది. సమంత, చెర్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.