శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (17:26 IST)

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో చెర్రీ "రంగస్థలం"?

మెగాపవర్ స్టార్ రాం చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడ

మెగాపవర్ స్టార్ రాం చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు ఈ చిత్ర కథకు సంబంధించిన ఓ వార్త లీక్ అయింది. 
 
నిజానికి ఈ కథ గ్రామీణ నేపథ్యంలో పల్లెలో జరిగే ప్రేమకథ అయివుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. దాంతోపాటు ఈ సినిమాలో 1985 కాలంనాటి రాజకీయాల ప్రస్తావన కూడా ఉంటుందనే విషయం ఈ మధ్యనే బయటికొచ్చింది. ఇక ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలోనే ఎక్కువగా కొనసాగనుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.
 
ఈ సినిమాలో చిట్టిబాబు సోదరుడు హత్యకి గురవుతాడు. ఆ హత్యకి కారకులు ఎవరనే విషయాన్ని తెలుసుకోవడం కోసం, వినికిడి లోపం కలిగిన చిట్టిబాబు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిస్తోంది. మొత్తానికి ఈ సినిమాను ప్రేమ, హాస్య, యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కించినట్టు సమాచారం. 
 
కాగా, ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక వచ్చే నెల 18వ తేదీన వైజాగ్ వేదికగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.