శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (11:39 IST)

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదల

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదలైన పాట ఈ సినిమా స్థాయిని పెంచిందని.. తెలిపారు. పాటకు లిరిక్స్ అందించిన బోస్‌కు మిలియన్ ఛీర్స్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 
 
అందమైన పల్లెటూరి కుర్రాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని చూస్తు పాడుకుంటున్నట్లు ఉన్న ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో సమంత రామలక్ష్మిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ''యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగినిల లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..'' అంటూ సాగే పాట యూత్‌ను, మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే.