సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (17:46 IST)

'లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే'... "రంగస్థలం" సింగిల్ సాంగ్ రిలీజ్ (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ఈచిత్రంలో సమంత హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్స

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ఈచిత్రంలో సమంత హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన 'వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే' అనే సింగిల్‌ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వయంగా ఆలపించారు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ సింగిల్ అందరినీ ఆకట్టుకుంటూ టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.