శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (12:27 IST)

భర్తతో కలిసి నటించనున్న సమంత?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సమంత, నాగచైతన్య జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ జంట ప్రేమ-పెళ్లి బంధంతో ఒక్కటైంది. పెళ్లికి తర్వాత కూడా వారివారి సినిమాలతో

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సమంత, నాగచైతన్య జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ జంట ప్రేమ-పెళ్లి బంధంతో ఒక్కటైంది. పెళ్లికి తర్వాత కూడా వారివారి సినిమాలతో బిజీగా వున్న ఈ జోడీ.. పెళ్లికి తర్వాత కూడా ఈ జంట వెండితెరపై కనిపించనుంది. రంగస్థలం, మహానటి, సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాలతో సమంత బిజీగా వుండగా చైతూ సవ్యసాచి సినిమా బిజీగా వున్నాడు. 
 
ఈ నేపథ్యంలో చైతూతో ''శైలజా రెడ్డి అల్లుడు'' చిత్రాన్ని రూపొందిస్తున్న మారుతి.. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. అయితే రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా మారి డీవీవీ దానయ్యతో కలిసి ''నిన్నుకోరి'' సినిమా చేశాడు. 
 
ఈ సినిమా హిట్ కొట్టడంతో.. డీవీవీ దానయ్య, దర్శకుడు శివ కాంబోలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చైతూను హీరోగా ఎంపిక చేసుకున్నారు. కథ, పాత్ర నచ్చడంతో ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు సమంత కూడా అంగీకరించినట్లు సినీ జనం చెప్తున్నారు.