గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (11:16 IST)

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసు: సమంత

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంత.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో చేతినిండా సినిమాలతో ఉన్న సమంత, త్వరలోనే భర్త నాగ చైతన్య పక్కన నాలుగో చిత్రంలో నటించనున్నట్లు వార్తలు సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంత.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో చేతినిండా సినిమాలతో ఉన్న సమంత, త్వరలోనే భర్త నాగ చైతన్య పక్కన నాలుగో చిత్రంలో నటించనున్నట్లు వార్తలు సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో ముందుంటుంది.

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసునని.. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ తర్వాత అందాలు చూపించాల్సి వుంటుందనే తెలిసే తాను వచ్చానని సమంత వ్యాఖ్యానించారు. 
 
కథ డిమాండ్ చేస్తే.. గ్లామర్‌గా నటించడం తప్పేమీ కాదని... అయితే అవసరం లేని చోట గ్లామర్‌గా ఉండటం తనకు ఉండదని సమంత తెలిపింది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే.. ఏ వృత్తిలోనైనా రాణించవచ్చునని సమంత అభిప్రాయం వ్యక్తం చేసింది. తాను చైతూతో గొడవలు పడుతూ ఉంటానని తెలిపింది. చైతూ బెట్టుతో తనతో మాట్లాడడని.. ఆపై తానే మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చింది.