సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (12:16 IST)

'రంగస్థలం' ట్రైలర్‌లో సమంతకు అవమానం.. ఎలా...? (ట్రైలర్)

మెగా హీరో రాంచరణ్ నటించిన "రంగస్థలం" సినిమా ట్రైలర్ రిలీజై సామాజిక మాథ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పల్లెటూరి వాతావరణంలో జరిగిన షూటింగ్ మొత్తాన్ని ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు.

మెగా హీరో రాంచరణ్ నటించిన "రంగస్థలం" సినిమా ట్రైలర్ రిలీజై సామాజిక మాథ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పల్లెటూరి వాతావరణంలో జరిగిన షూటింగ్ మొత్తాన్ని ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. చెవిటి వ్యక్తిగా, సౌండ్ ఇంజనీర్‌గా తనకు తానే రాంచరణ్ ట్రైలర్‌లో పరిచయం చేసుకుంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే ఇందులో హీరోయిన్‌గా సమంత నటించింది. 
 
ఏ సినిమా ట్రైలర్‌లో అయినా హీరో, హీరోయిన్‌ను చూపిస్తారు. హీరోను ఎక్కువగా చూపించినా హీరోయిన్‌ను మాత్రం కొద్దిసేపయినా చూపిస్తారు. కానీ 'రంగస్థలం' సినిమాలో మాత్రం అస్సలు సమంతకు కనిపించదు. ఎక్కడా కూడా సమంత కనిపించకపోవడంతో ఆమె అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. హీరో ఓరియంటెడ్ సినిమా అయినా హీరోయిన్ లేకుండా సినిమా నడవడం సాధ్యం కాదు. 
 
అలాంటిది ఒక అగ్రహీరోయిన్‌గా ఉన్న సమంతను అస్సలు ట్రైలర్‌లో చూపించకపోవడం ఏమిటని సమంత అభిమానులు సామాజిక మాథ్యమాల్లో మండిపడుతున్నారు. సినిమా డైరెక్టర్ సుకుమార్‌ను ప్రశ్నిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ సుకుమార్ ఈ విషయంపై స్పందించకపోవడం అభిమానుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.