గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (18:17 IST)

నాగచైతన్య.. సమంత అంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బ

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, సమంత ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. 
 
శివ ఇంతకుముందు నానితో ''నిన్ను కోరి'' సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో క్రేజున్న సమ్మూ-చైతూ జంటను పెళ్లికి తర్వాత వెండితెరపై జంటగా చూపెట్టేందుకు శివ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇందుకోసం సమంత-చైతూ జంటకు రూ.7కోట్ల వరకు పారితోషికం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
సాధారణంగా రూ.3కోట్లు తీసుకునే చైతూ.. సమంతతో కలిసి ఈ సినిమాకు రూ.7కోట్లు పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇందుకు క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.