మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (11:02 IST)

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ''రంగస్థలం''.. బాహుబలి తరహాలో?

''రంగస్థలం'' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజే

''రంగస్థలం'' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజే బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.43.78 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. 
 
అలాగే ఓవర్సీస్‌లోనూ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం 2.45 మిలియన్ డాలర్లను రాబట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తొలి 4 రోజుల్లో ఈ సినిమా వందకోట్ల గ్రాస్‌ను సాధించేసింది. దీంతో బాహుబలి తర్వాత అంతవేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా రంగస్థలమని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రంగస్థలం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.
 
కాగా రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటించగా ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.