ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:58 IST)

చెర్రీ... 'చిట్టిబాబు'లా నువ్వు తప్ప ఎవ్వరూ చేయలేరు... ఎన్టీఆర్ కామెంట్స్

రంగస్థలం చిత్రం బాక్సాఫీసులను ఒకవైపు కొల్లగొడుతూ వెళుతోంది. మరోవైపు ఎందరో ప్రశంసలను దక్కించుకుంటోంది. వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు రాంచరణ్ నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తను రంగస్థలం చిత్రాన్ని చూశారు. ఈ చిత్రంపై యంగ్ టైగర్ ఎన్

రంగస్థలం చిత్రం బాక్సాఫీసులను ఒకవైపు కొల్లగొడుతూ వెళుతోంది. మరోవైపు ఎందరో ప్రశంసలను దక్కించుకుంటోంది. వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు రాంచరణ్ నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తను రంగస్థలం చిత్రాన్ని చూశారు. ఈ చిత్రంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... 'ఇప్పుడే రంగస్థలం చూశాను. చరణ్ నీకు హ్యాట్సాఫ్. నీకు దక్కుతోన్న ఈ ప్రశంసలకు నువ్వు పూర్తిగా అర్హుడివి. 
 
చిట్టిబాబు పాత్రకి గౌరవం తెచ్చావ్. ఈ పాత్రను ఇంతకంటే బాగా ఎవరూ చేయలేరు' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పైన రాంచరణ్ స్పందిస్తూ... 'థ్యాంక్యూ బ్రదర్' అని చెప్పేశాడు. ఇదిలావుంటే రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులను సృష్టించే దిశగా వెళుతోంది. మరోవైపు ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు.