మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (09:20 IST)

భర్తను మేల్ ఎస్కార్ట్‌గా చిత్రీకరించి పోర్న్ వెబ్‌సైట్‌లో.. ప్రియుడి కోసం భార్య

ప్రియుడి కోసం ఓ భార్య కట్టుకున్న భర్త పరువు తీసింది. ప్రియురాలి కోసం ప్రియుడు కూడా కొత్త నాటకం ఆడాడు. చివరకు ఈ రెండు నాటకాలు బయటపడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...

ప్రియుడి కోసం ఓ భార్య కట్టుకున్న భర్త పరువు తీసింది. ప్రియురాలి కోసం ప్రియుడు కూడా కొత్త నాటకం ఆడాడు. చివరకు ఈ రెండు నాటకాలు బయటపడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అనంతపురం జిల్లా గుంతకల్‌, తిలక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ సయ్యద్‌ వలీ (32) అలియాస్‌ రామ్‌ అద్వైత రెడ్డి అనే వ్యక్తి పట్టభద్రుడు. రెండేళ్లపాటు ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాడు. 2016 వరకు గుంతకల్‌తోపాటు తిరుపతి, కర్నూల్‌లో పలు ఫార్మా సంస్థల్లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు.
 
అప్పటికే మోసాలు చేయడం నేర్చుకున్న సయ్యద్‌ వలీని ఓ చీటింగ్‌ కేసులో నిందితుడిగా గుర్తించి 2017 మార్చిలో కర్నూల్‌ 4వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకుని ఎల్‌బీనగర్‌లో నివసిస్తున్నాడు. జాబ్‌ కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం చేస్తూ ఉద్యోగార్థులకు వల వేయసాగాడు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా గ్రూపులు సృష్టించి ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలు చేయసాగాడు. 
 
ఈ క్రమంలో షర్మిల అనే యువతితో అతడికి పరిచయమైంది. ఆ తర్వాత షర్మిల అతని ప్రేమలో పడిపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ముస్లిం మతస్తుడు అయితే తల్లిదండ్రులు అంగీకరించని భావించిన షర్మిల... తన ప్రియుడిని రామ్‌ అద్వైతగా తల్లిదండ్రులకు పరిచయం చేసింది. 
 
వారు పెళ్లికి అంగీకరించకపోగా, కళ్యాణ్‌ అనే యువడితో ఆమెకు సంబంధం కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న సయ్యద్ వలీ.. కళ్యాణ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను బెదిరించడంతో వారు వెనుదిరిగారు. దీంతో షర్మిల తల్లిదండ్రులు ఇదే విషయమై ఎల్‌బీనగర్‌ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్టు చేశారు.
 
ఆ తర్వాత ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన సంతోష్‌ అనే వైద్యుడిని తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకుంది. ఇది సయ్యద్‌ వలీకి నచ్చకపోవడంతో ఇద్దరూ కలిసి పథకం రచించారు. పథకం ప్రకారం లొకాంటో డాట్‌ కామ్‌లో పెళ్లికొడుకు ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌ వివరాలతో సంతురాక్జ్‌ అనే ఐడీతో వ్యభిచారి(మేల్‌ ఎస్కార్ట్‌)గా పోస్ట్‌ చేశారు. 
 
ఆ తర్వాత తమ పథకంలో భాగంగా, పెళ్లిరోజే షర్మిల భర్త సంతోష్‌ను నిలదీసింది. దీంతో అతను నిర్ఘాంతపోయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... కూపీ లాగగా, అసల గుట్టు బహిర్గతమైంది. దీంతో షర్మిలతో పాటు.. ప్రియుడు సయ్యద్ వలీలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.