మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 22 జూన్ 2018 (22:04 IST)

భార్య చెప్పుతో కొట్టిందని... భర్త ఆత్మహత్య

కృష్ణాజిల్లా చాట్రాయిలో పరువు కోసం ఓ ప్రాణం పోయింది. భార్య చెప్పుతో కొట్టిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే... ఏడాది క్రితం కిశోర్, శ్యామలకు వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో వారం రోజులకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించా

కృష్ణాజిల్లా చాట్రాయిలో పరువు కోసం ఓ ప్రాణం పోయింది. భార్య  చెప్పుతో  కొట్టిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే...  ఏడాది క్రితం కిశోర్, శ్యామలకు వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో వారం రోజులకే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్త కిశోర్ తనను వేధిస్తున్నాడంటూ భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీస్ స్టేషన్‌లో భార్యాభర్తలు ఇద్దరిని పోలీసులు విచారిస్తుండగా వారి ముందే కిషోర్‌ను చెప్పుతో కొట్టింది భార్య శ్యామల. అందరిముందు చెప్పుతో కొట్టిందని భర్త కిషోర్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో సహా ధర్నాకు దిగారు మృతుడు బంధువులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.