మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (14:28 IST)

మాకూ ఓ గన్ ఇవ్వండి.. ధోనీ భార్య సాక్షి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి గన్ లైసెన్స్ కోరారు. తనకు ప్రాణ హాని ఉందని, అందుచేత గన్ లైసెన్స్ కావాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేశారు. ధోనీ క్రికెట్ మ్యాచ్‌ల దృష్ట్యా బిజీగా వుంటాడని.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి గన్ లైసెన్స్ కోరారు. తనకు ప్రాణ హాని ఉందని, అందుచేత గన్ లైసెన్స్ కావాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేశారు. ధోనీ క్రికెట్ మ్యాచ్‌ల దృష్ట్యా బిజీగా వుంటాడని.. ధోనీ ఇంట్లో వుండే సమయం చాలా తక్కువని.. అందుకే తనకు గన్ లైసెన్స్ కావాలని సాక్షి తెలిపారు. కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో వుంటున్నానని.. ఏదో ఒక పనిపై బయటకు వెళ్తుంటామని.. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్లాల్సి వస్తుందని ధోనీ భార్య వెల్లడించారు. 
 
భద్రతలో భాగంగా అదీ త్వరగా లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ లేదా 0.32 రివాల్వర్‌ ఇప్పించాల్సిందిగా సాక్షి కోరారు. అయితే ధోనీ భార్య సాక్షి.. గన్ లైసెన్స్ కోరటం ప్రస్తుతం సంచలనంగా మారింది. హైప్రొఫైల్ ఫ్యామిలీ, ఎంతో భద్రత మధ్య ఉండే ఈ కుటుంబానికి నిత్యం ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది. 
 
అయినప్పటికీ పోలీస్ శాఖకు రాసిన లేఖలో సాక్షి భయపడుతూ గన్ కోరటం చర్చనీయాంశమైంది. సాక్షికి ఏమైనా బెదిరింపులు వచ్చాయా అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఓ సెలెబ్రిటీ, స్టార్ క్రికెటర్ భార్య గన్ కావాలని కోరడం వెనుక కారణం ఏమిటని నెటిజన్లు అడుగుతున్నారు.