శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (12:18 IST)

భార్యకు గడ్డం పెరిగింది. గొంతుకూడా మగవారిలా వుంది.. విడాకులు?

భార్యకు గడ్డం పెరిగింది. గొంతుకూడా మగవారిలా వుందంటూ ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు విడాకులు కావాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది.

భార్యకు గడ్డం పెరిగింది. గొంతుకూడా మగవారిలా వుందంటూ ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు విడాకులు కావాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి చూపుల్లో పరదా కట్టి కూర్చోబెట్టారు. పెళ్లి చూపుల వేళ పరదా తీయాలని తాను కోరితే, అది సంప్రదాయం కాదని భార్య తరఫు బంధువులు చెప్పారన్నారు. 
 
అలాగే వివాహంలో కూడా ఆమెను తాను చూడలేదని.. భార్య కుటుంబీకులు తనను మోసం చేశారని.. అందుచేత ఆమెతో విడాకులు కావాలని సదరు వ్యక్తి కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, పిటిషన్ దారు భార్యను విచారించింది. 
 
తన శరీరంలో హార్మోన్ల అసమతుల్యం మాట వాస్తవమని, కానీ అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని భార్య తెలిపింది. తనపై భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆమె న్యాయమూర్తికి విన్నవించింది. దీంతో విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది.