మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (10:37 IST)

నా భార్యకు గడ్డం వుంది.. కాపురం చేయలేను.. విడాకులు కావాలి..

నా భార్యకు గడ్డం వుంది.. కాపురం చేయలేను.. విడాకులు ఇప్పిండి అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ గడ్డం కారణంగా ఆమెతో కలిసివుండలేక పోవడమే కాకుడా, తనకు అడ్డంకిగా మారిందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వెలుగ

నా భార్యకు గడ్డం వుంది.. కాపురం చేయలేను.. విడాకులు ఇప్పిండి అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ గడ్డం కారణంగా ఆమెతో కలిసివుండలేక పోవడమే కాకుడా, తనకు అడ్డంకిగా మారిందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ భర్త తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు గడ్డం ఉందని.. అది తనకు అడ్డంకిగా మారిందని ఆ భర్త విడాకులు కోరాడు. అంతేకాదు, పెళ్లికి ముందు తనకు ఈ విషయం తెలియదని.. తన భార్య కుటుంబం మోసం చేసిందని వాపోయాడు. పెళ్లికి ముందు ఒకసారి తనను కలిసి మాట్లాడానని.. అయితే అప్పుడు ఆమె తన ముఖానికి ముసుగు ధరించిందని గుర్తుచేశాడు. 
 
ఈ పిటిషన్‌కు భార్య సమాధానం చెప్పింది. తనకు అవాంఛిత రోమాలు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ కొన్ని వైద్య విధానాల ద్వారా వాటిని తొలగించుకుంటున్నట్లు భార్య తన భర్త పిటిషన్‌కు సమాధానమిచ్చింది. తన భర్త విడాకులు కోరుతూ చెప్పిన కారణంలో నిజం లేదని.. తనను బయటకు గెంటేయాలని చూస్తున్నాడని ఆమె చెప్పింది. ఇరు వాదనలు విన్న అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు భర్త పిటిషన్‌ను కొట్టివేసింది.