పశ్చిమగోదావరిలో యువతి దారుణహత్య... పురుగుల మందు తాగిన ప్రియుడు...
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో జంగారెడ్డిగూడెంకు చెందిన దొండపూడి లహరిని అర్ధరాత్రి 1.30 సమయంలో కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ (24) అనే యువకుడు, అనంతరం పురుగులమందు త
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో జంగారెడ్డిగూడెంకు చెందిన దొండపూడి లహరిని అర్ధరాత్రి 1.30 సమయంలో కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ (24) అనే యువకుడు, అనంతరం పురుగులమందు తాగి తాను కూడా ఆత్మ హత్య చేసుకున్నాడు.
ప్రేమ వ్యహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మృతురాలు లహరి పోలవరానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడడంతో ప్రియుడు కిరణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.