సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (12:17 IST)

మాజీ భార్యకు పవర్ స్టార్ విషెస్.. బండ్ల గణేష్ ఏమన్నారు?

రెండో పెళ్లి చేసుకోబోతున్న తన మాజీ భార్య రేణూ దేశాయ్‌కు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న రేణుగారికి నా శుభాకాంక్ష‌లు. ఆమె ఎల్ల‌ప్పుడూ సంతో

రెండో పెళ్లి చేసుకోబోతున్న తన మాజీ భార్య రేణూ దేశాయ్‌కు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న రేణుగారికి నా శుభాకాంక్ష‌లు. ఆమె ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆ దేవుణ్ని ప్రార్థిస్తాన"ని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.
 
దీనిపై పవన్ వీరాభిమానుల్లో ఒకరైన సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. 'మా బాస్ అంటే ఇది' అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన మ‌నస్తత్వ‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.