మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (09:31 IST)

పాపం పండింది.. 7నెలల శిశువుపై అత్యాచారం.. 19ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష

పాపం పండింది. ఏడు నెలల శిశువును అత్యాచారం చేసిన 19 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష పడింది. ఈ మేరకు రాజస్థాన్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణకు వచ్చిన 70 రోజుల్లోనే తీర్పును వెలువరించినట్లు

పాపం పండింది. ఏడు నెలల శిశువును అత్యాచారం చేసిన 19 ఏళ్ల యువకుడికి ఉరిశిక్ష పడింది. ఈ మేరకు రాజస్థాన్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణకు వచ్చిన 70 రోజుల్లోనే తీర్పును వెలువరించినట్లు ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఏడు నెలల శిశువుపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడటం ఘోరమని.., అతనికి సభ్య సమాజంలో తిరిగే హక్కుకానీ, భూమిపై జీవించే హక్కు కానీ లేవని జితేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. రాజస్థాన్‌లో అత్యాచారాలు, లైంగిక వేధింపుల చట్టాలను మరింత కఠినతరం చేస్తూ, మార్చిలో చట్ట సవరణ జరుగగా, ఆ తరువాత అత్యాచారం కేసులో మరణదండన తీర్పు వచ్చిన తొలి కేసు ఇదే.
 
కాగా మే 9న పింటూ అనే యువకుడు, తన పొరుగింట్లోని పాపను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప కనిపించక తల్లిదండ్రులు వెతుకుతుంటే, కిలోమీటరు దూరంలోని ఫుట్ బాల్ మైదానంలో ఏడుస్తూ, రక్తమోడుతున్న పరిస్థితిలో కనిపించింది. పాపకు అల్వార్‌లోని ఆసుపత్రిలో 20 రోజుల పాటు చికిత్సను అందించాల్సి వచ్చింది.

ఆపై పింటూను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాజస్థాన్ తరహాలోనే దేశ వ్యాప్తంగా చట్టాలను కఠినతరం చేస్తే.. మహిళలపై అఘాయిత్యాలు జరగవని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.