శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జులై 2018 (11:11 IST)

సోదరుడి హత్యకు ప్రతీకారం.. పప్పులో విషం కలిపిన బాలిక.. చివరికి?

ఓవైపు చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చిన్నారుల్లో నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏడో తరగతి చదువుతున్న బాలిక దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా స

ఓవైపు చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చిన్నారుల్లో నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏడో తరగతి చదువుతున్న బాలిక దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా స్కూలు మధ్యాహ్న భోజనంలో విషం కలిపింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బంకట పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో మూడో తరగతి చదువుతున్న బాలిక సోదరుడు ఏడాది ఏప్రిల్‌లో మృతి చెందాడు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరు విసిరిన రాయి బాలుడి తలకు బలంగా తాకడంతో చిన్నారి మృతి చెందాడు. అతడి మృతికి కారణమైన ఐదో తరగతి విద్యార్థిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.
 
అయితే తన సోదరుడిని చంపిన వారిపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న బాలిక మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న పప్పులో విష పదార్థాలను కలిపింది. ఈ భోజనాన్ని ఎవరూ తినకపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆహారం కల్తీ కాలేదని తేలింది. అందులో ఎటువంటి విషపదార్థాలు లేవని తేల్చారు. బాలికపై డియోరియో పోలీసులు సెక్షన్ 328 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను జువైనల్ హోంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.