శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జులై 2018 (12:22 IST)

ప్రాణానికి ప్రాణం : అమెరికాలో శరత్‌ను కాల్చిన హంతకుడి కాల్చివేత

అమెరికాలోని కేన్సస్‌లో ఓ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో వరంగల్‌, కొత్తవాడ వాసవీకాలనీకి చెందిన శరత్ అనే విద్యార్థి చనిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల

అమెరికాలోని కేన్సస్‌లో ఓ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో వరంగల్‌, కొత్తవాడ వాసవీకాలనీకి చెందిన శరత్ అనే విద్యార్థి చనిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే చుట్టుముట్టారు. అయితే పోలీసులపైనే హంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు.
 
ఈ కాల్పుల్లో ఆ హంతకుడు ప్రాణాలు కోల్పోయాడు. హంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. నిందితుడు ఫొటోలను మాత్రమే విడుదల చేశారు. అతని పూర్తి వివరాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు. గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. 
 
కాగా, జూలై 7వ తేదీన అమెరికాలోని కన్సన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ నిందితుడే ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దోపిడీ కోసం వచ్చాడు. కాల్పుల నుంచి తప్పించుకుని పారిపోతున్న కొప్పు శరత్‌ను వెనుక నుంచి కాల్చి చంపాడు.