శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 12 జులై 2018 (17:04 IST)

పరిపూర్ణానంద కోసం కాకినాడకు పరుగెత్తిన తెలంగాణ పోలీసులు... ఎందుకంటే?

హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వ

హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 
 
సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు స్వామిజీ ప్రణాళికలు తయారుచేసుకోవడంతో తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు కూడా ఆయనను బహిష్కరించాయి. ఈ మేరకు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసులలో పేర్కొన్నారు. పరిపూర్ణానందకు ఈ నోటీసులు అందజేయడానికి పోలీసులు కాకినాడకు బయల్దేరారు.