మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 25 జులై 2018 (18:29 IST)

తెలుగు రాష్ట్రాల్లోనే టాప్... రూ. 10 కోట్లు ఇన్‌కమ్ టాక్స్ పే చేసింది... ఆమె ఎవరు?

ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంద

ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నిజాయితీగా ఐటీ శాఖకు పన్ను కట్టేస్తున్నారు. వారు కడుతున్న ఐటీ పన్ను చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. 
 
తాజాగా ఐటీ సెక్టారుకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 10 కోట్లను చెల్లించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017-18 సంవత్సరానికి గాను ఆమె రూ. 10 కోట్లను టాక్సుకు చెల్లించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. కానీ ఆమె పేరును మాత్రం చెప్పలేదు. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి టాక్సు చెల్లించిన మొత్తం రూ. 49,775 కోట్లుగా వున్నట్లు అధికారులు తెలిపారు. ఇది గత ఏడాది కంటే 24 శాతం అధికమని చెప్పారు. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ధనవంతులు అయిపోతున్నారన్నమాట. శుభమ్.