1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. Dandruff: causes and treatments

చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే...

చుండ్రు అనేక కారణాల వలన వస్తుంది. దీంతో తలపై ఉన్న చర్మం పొట్టుగా మారి చుండ్రులా రాలుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, పోషణ లోపం వంటి కారణాలే చుండ్రు రావడానికి కారణమవుతున్నాయి. చుండ్రును సమర్థవంతంగా తొలగించుకోవడానికి ఈ చిట్క

dandruff
చుండ్రు అనేక కారణాల వలన వస్తుంది. దీంతో తలపై ఉన్న చర్మం పొట్టుగా మారి చుండ్రులా రాలుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, పోషణ లోపం వంటి కారణాలే చుండ్రు రావడానికి కారణమవుతున్నాయి. చుండ్రును సమర్థవంతంగా తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
వేపాకులతో తయారుచేసిన హెయిర్ ఆయిల్‌ను వాడితే మంచిది. దీంతో చుండ్రు పోవడమే కాకుండా జుట్టుకు పోషణ అందుతుంది. తద్వారా శిరోజాలు దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా ఆముదమును కలుపుకుని కాసేపు మరిగించాలి. ఆ మిశ్రమం చల్లారిన తరువాత ఆ నూనెను వెంట్రుకలకు రాసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. 
 
మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయడం వలన చుండ్రు బాధ తప్పుతుంది. వేపాకులు నీటిలో మరిగించి చల్లారిన తరువాత ఆ నీటితో తలస్నానం చేస్తే కూడా చుండ్రు పోతుంది. కలబంద గుజ్జుతో జుట్టుకు మర్దనా చేసుకుని తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. 
 
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్ టీ ట్రీ ఆయిల్‌ను కలుపుకుని జుట్టుకు మర్దనా చేయాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు తొలగిపోతుంది. తులసి ఆకులను, ఉసిరి కాయలను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. గంట సేపు తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వంటసోడాను ముఖానికి రాసుకుంటే... నల్లటి వలయాలు తొలగిపోతాయా?