మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (12:33 IST)

తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టాలా? ఆకుకూరలను తీసుకోవాల్సిందే

తెల్లజుట్టు ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. 20లు దాటకుండానే చాలామందికి తెల్లజుట్టు వచ్చేస్తోంది. దీంతో తెల్లజుట్టు సమస్యను తొలగించుకునేందుకు చాలామంది బ్యూటీ పార్లర్లు, స్పాల వెంట తిరుగుతున్నారు.

తెల్లజుట్టు ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. 20లు దాటకుండానే చాలామందికి తెల్లజుట్టు వచ్చేస్తోంది. దీంతో తెల్లజుట్టు సమస్యను తొలగించుకునేందుకు చాలామంది బ్యూటీ పార్లర్లు, స్పాల వెంట తిరుగుతున్నారు.

అలాంటి వారు మీరైతే ఈ జాగ్రత్తలు పాటించండి. వయస్సుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజం. కానీ చిన్నవయస్సులోనే తల నెరసిపోతే మాత్రం ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. రోజూ తీసుకునే ఆహారంలో మల్టీ విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు వుండేలా చూసుకోవాలి. 
 
రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఆకుకూరలను వారానికి నాలుగుసార్లు తీసుకుంటే జుట్టు నెరసిపోవు. ఇంకా ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. ఆకుకూరలను రోజువారీగా ఒక కప్పు తీసుకుంటే.. జుట్టు బాగా పెరగడంతో పాటు తెల్లజుట్టు సమస్య వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఏదో ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఆలోచనలకు స్వస్తి పలకాలి. ఎందుకంతే ఆలోచనలు, ఒత్తిడి కారణంగానూ తెల్లజుట్టు సమస్య వుంటుంది. అందుకే మెదడును ప్రశాంతం వుంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలాచేస్తే జుట్టు నెరసిపోకుండా వుండటమే కాకుండా.. ఒత్తిడితో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.