శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (18:47 IST)

వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా.. మీకు "ఆ" రోగం వచ్చినట్లే...

వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఒక పరిశోధనలో వెల్లడైందట. 6 వేల మంది పురుషులపై పరిశోధన చేయగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారిలో శరీరంలో కొవ్వు, రక్

వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఒక పరిశోధనలో వెల్లడైందట. 6 వేల మంది పురుషులపై పరిశోధన చేయగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారిలో శరీరంలో కొవ్వు, రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు. వాళ్ళలో పురుష సెక్స్ హార్మోన్లు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
 
గర్భధారణ విషయంలో ప్రతి మూడు జంటల్లో ఒక జంట వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడం, వీర్యం నాణ్యత లేకపోవడం అనే సమస్యలు ఎదుర్కొంటోంది. వీర్యకణాల సంఖ్య కూడా పురుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా అని ఇటలీలో పిల్లలు లేని దంపతులను పరిశీలించారట. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయి తక్కువగా ఉండేందుకు 12 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. దీని వల్ల కండరాలు బరువు, ఎముకల సాంద్రత తగ్గి, ఎముకలు సులభంగా విరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందట. 
 
గర్భధారణ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న దంపతుల్లో పురుషులకు సంతాన సాఫల్య నిపుణులు సరిగ్గా వైద్య పరీక్షలు చేయాలి. ఎందుకంటే వారిలో వ్యాధిగ్రస్తత, మరణించే అవకాశాలు ఎక్కువ అని వివరించారు. ఈ పరిశోధన నిర్వహించిన సైంటిస్టుటు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటమే జీవక్రియ సమస్యలకు కారణమని నిరూపణ కాలేదని, అయితే రెండింటి మధ్య సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. కేవలం వంధ్యత్వమే ఆరోగ్య సమస్యలకు కారణమని చెప్పడానికి ప్రస్తుతం బలమైన రుజువులేమీ లేవు. అయితే ఆ రెండింటి మధ్య సంబంధం ఉండవచ్చని తెలిపారు వైద్యులు.