శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (09:24 IST)

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి నీచ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ రెబల్స్ మహిళల మర్మాంగాల్లో కాల్చుతామంటూ రోడ్రిగో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా వివాదస్పదమైంది. ప్రపం

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ రెబల్స్ మహిళల మర్మాంగాల్లో కాల్చుతామంటూ రోడ్రిగో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా వివాదస్పదమైంది. ప్రపంచ దేశాలన్నీ రోడ్రిగో వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. మాదక  ద్రవ్యాలతో పట్టుబడిన వారిని కాల్చి పారేయమంటూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు చేసిన క్రూర వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. 
 
కమ్యూనిస్ట్ రెబల్స్ మహిళలను ఉద్దేశించి.. రోడ్రిగో మాట్లాడుతూ.. మీరున్నా లేకపోయినా ఒక్కతేనని అన్నారు. ఇటీవల జైళ్లలో వున్న రెబల్స్ మహిళలను సిబ్బందితో అత్యాచారాలు చేయించి చంపేస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ రోడ్రిగో వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మహిళా రెబెల్స్‌ను షూట్ చేయాలని సైనికులకు ఆదేశాలు కూడా జారీ చేశాడు.
 
ఇకపోతే... ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె ఇలా నోరుపారేసుకోవడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో డ్యుటెర్టె పౌరులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరులైనా సరే తుపాకులతో కనిపిస్తే కాల్చి పారేయాలని తన సైన్యాన్ని ఆదేశించారు. పొరపాటున పౌరులను చంపేసినా చట్టబద్ధంగా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చారు.