ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (12:13 IST)

మహిళా స్విమ్మర్లు స్నానం చేస్తుంటే... ఆ స్విమ్మర్ ఏం చేశాడో తెలుసా?

మహిళా స్విమ్మర్లు స్నానం చేస్తుంటే పురుష స్విమ్మర్ వీడియో తీసి సస్పెండ్‌కు గురయ్యాడు. అతని పేరు ప్రశాంత్ కర్మాకర్. స్వదేశానికి చెందిన ప్రముఖ పారా స్విమ్మర్. మహిళా స్విమ్మర్లు స్విమ్మింగ్ చేస్తుండగా అన

మహిళా స్విమ్మర్లు స్నానం చేస్తుంటే పురుష స్విమ్మర్ వీడియో తీసి సస్పెండ్‌కు గురయ్యాడు. అతని పేరు ప్రశాంత్ కర్మాకర్. స్వదేశానికి చెందిన ప్రముఖ పారా స్విమ్మర్. మహిళా స్విమ్మర్లు స్విమ్మింగ్ చేస్తుండగా అనుమతి లేకుండా వీడియో తీసినందుకు‌గాను అథ్లెట్ స్థాయి నుంచి కోచ్‌గా మారిన కర్మాకర్‌పై నిషేధం విధిస్తూ భారత పారాలింపిక్స్ కమిటి నిర్ణయం తీసుకుంది. 
 
నిజానికి ప్రశాంత్ కర్మాకర్ ఉత్తమమైన పారాలింపిక్స్. తన ప్రదర్శనతో దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టాడు కూడా. అయితే, తన అనైతిక, వికృత చేష్టలతో భారత పారాలింపిక్స్ సంఘం ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా మూడేళ్ళపాటు నిషేధానికి గురయ్యాడు. 
 
కాగా, భారత ప్రభుత్వం అందించే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కర్మాకర్ దక్కించుకున్నారు. 2011లో అర్జున అవార్డు, 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డు, 2014లో భీమ్ అవార్డు, 2009, 2011లో స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో 37 ప‌త‌కాలు గెలిచాడు. 
 
అర్జున అవార్డు పొందిన తొలి భారత పారాలింపిక్ క్రీడాకారుడు కూడా కావడం విశేషం. అంతేగాక 2016 రియో పారాలింపిక్స్ గేమ్స్‌కు స్విమ్మింగ్ టీమ్ కోచ్‌గా కూడా వ్యవహరించిన ఘనత ఆయన సొంతం. అలాంటి స్విమ్మర్.. ఇపుడు వికృత చేష్టలకు పాల్పడడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది.