బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:27 IST)

ఫిట్నెస్ కోసం సురేష్ రైనా పాట్లు చూడతరమా? (వీడియో)

భారత క్రికెట్ వన్డే జట్టు నుంచి ఉద్వాసనకుగురైన క్రికెటర్లలో సురేష్ రైనా ఒకరు. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఫిట్నెస్‌లేని కారణంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

భారత క్రికెట్ వన్డే జట్టు నుంచి ఉద్వాసనకుగురైన క్రికెటర్లలో సురేష్ రైనా ఒకరు. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఫిట్నెస్‌లేని కారణంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. 
 
దీనిపై సురేష్ రైనా ఇటీవల వివాదాస్పద కామెంట్స్ కూడా చేశారు. ఆటతీరు బాగా ఉన్నప్పటికీ జట్టు నుంచి తీసేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేసమయంలో విమర్శలు చేయడంమానుకుని ఫిట్నెస్‌పై కూడా దృష్టిసారించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు సూచనలు చేశారు. 
 
దీంతో ఇకలాభం లేదనుకుని ఫిట్నెస్‌ సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఇందులోభాగంగా అలసిపోయేలా మైదానంలో పరుగెడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.