గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:08 IST)

హార్దిక్ పాండ్యాతో ఆ సంబంధమా? తప్పుడు వార్తలు రాస్తారా?

గతంలో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలను హార్దిక్ ఖండించడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా హార్

గతంలో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలను హార్దిక్ ఖండించడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా హార్దిక్ పాండ్యాతో తాను సన్నిహితంగా వున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ స్పందించింది. ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడనని.. ఇంకా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చింది. 
 
ప్రజలు ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చునని ఫైర్ అయ్యింది. డేటింగ్ వార్తలు ఆవేదనకు గురిచేశాయని ఎల్లీ అవ్రమ్ చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీలపై ఇలాంటి వార్తలెన్నో వస్తాయంటూ.. వాటిని పట్టించుకుంటే అంతేనని చెప్పింది. కాగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ అవ్రమ్ హాజరు కావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి.