బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:10 IST)

క్రికెట్ బోర్డులో ముసలం.. జట్టు జట్టంతా మూకుమ్మడి రాజీనామాలు

సంచలనాలకు మారుపేరైన కెన్యా క్రికెట్ బోర్డులో ముసలం చెలరేగింది. ఫలితంగా ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌తో సహా జట్టు సభ్యులంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో ఘోర ప్రదర్శన క

సంచలనాలకు మారుపేరైన కెన్యా క్రికెట్ బోర్డులో ముసలం చెలరేగింది. ఫలితంగా ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌తో సహా జట్టు సభ్యులంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో ఘోర ప్రదర్శన కనపరిచింది. ఇది కెన్యా క్రికెట్ బోర్డులో తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఈ ఓటమి బోర్డు సభ్యులు, కెప్టెన్ రాజీనామాలకు దారి తీసింది. ఈ టోర్నీలో పాల్గొన్న ఆరు జట్లలో కెన్య చివరి స్థానంలో నిలిచింది. అంతేకాక గత నెల జింబాబ్వే వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వాలిఫర్‌లో కూడా కెన్యా చిత్తుగా ఓడింది. 
 
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. కెన్యా కెప్టెన్ రాకెప్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతకుముందే క్రికెట్ కెన్యా ఛైర్మన్ జాకీ జాన్ మహ్మద్, డైరెక్టర్ ఆఫ్ డెవలప్‌మెంట్ అభిజీత్ సర్కార్ తమ రాజీనామాలు సమర్పించారు. కాగా ఈ రోజు కెప్టెన్ కూడా రాజీనామా చేయడంతో అతని అడుగుజాడల్లోనే తాత్కాలిక కోచ్ థామస్ ఓడియో కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ కారణంగా కెన్యా క్రికెట్ బోర్డ్ తీవ్ర సంక్షోభంలో కూరుకున్నట్టయింది.