శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (16:07 IST)

బాబాయ్ పార్టీ తరపున ప్రచారం చేయనున్న మెగా హీరో!

ప్రచారం అంటే ఎన్నికల్లో ప్రచారం చేయడం కాదు. పార్టీ గురించి ప్రచారం చేయడం. అది కూడా చిరంజీవి కొడుకు రాంచరణ్. బాబాయ్‌పై ప్రేమ, రాజకీయాల్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ రాణించాలన్న ఆకాంక్ష రెండూ రాంచరణ్‌లో ఎక్కువ

ప్రచారం అంటే ఎన్నికల్లో ప్రచారం చేయడం కాదు. పార్టీ గురించి ప్రచారం చేయడం. అది కూడా చిరంజీవి కొడుకు రాంచరణ్. బాబాయ్‌పై ప్రేమ, రాజకీయాల్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ రాణించాలన్న ఆకాంక్ష రెండూ రాంచరణ్‌లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మొదటిరోజు తెలంగాణా రాష్ట్రంలో పర్యటన కోసం వెళుతున్నప్పుడు ట్విట్టర్‌లో మెగా ఫ్యామిలీలోని వారందరూ ఒకరి తర్వాత ఒకరు విషెస్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో ఉన్న మెగా ఫ్యామిలీలో రాంచరణ్‌కే పవన్ అంటే ఎక్కువ అభిమానం. అందుకే స్వయంగా జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.
 
ఇప్పటికే తన తండ్రి చిరంజీవితో ఈ విషయంపై రాంచరణ్ మాట్లాడారట. పవన్‌కు ప్రచారం చేస్తే నాకెలాంటి అభ్యంతరం లేదని చెర్రీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి చెప్పాడట. దీంతో రాంచరణ్‌కు లైన్ క్లియరైంది. తెలంగాణా,  ఏపీలలో పవన్ పర్యటనలు పూర్తి అయ్యే లోపే మధ్యలోనే రాంచరణ్‌ ప్రచారం చేయనున్నారట. రాజకీయాల గురించి పెద్దగా తెలియని రాంచరణ్ కేవలం బాబాయ్ సమర్థవంతమైన వ్యక్తి ఎలా అన్నది మాత్రమే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు రాజకీయ విశ్లేషకులు.