గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 9 మార్చి 2018 (22:09 IST)

వామ్మో కండరాలు పట్టేస్తున్నాయి... అబ్బా... ఏం చేయాలి?

ఈమధ్య ప్రతి ఒక్కరిలో కండరాలు పట్టడం, కాలి మడాల నొప్పి రావడం సర్వసాధారణమైనది. రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో, మెళకువలో కూడా ఉన్నట్టుండి తొడలు, కాలిపిక్కలు పట్టేయడం జరుగుతుంది. ఇలా వచ్చిన నొప్పి కొద్దినిమిషాల వరకు ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత కూడ అక్కడ

ఈమధ్య ప్రతి ఒక్కరిలో కండరాలు పట్టడం, కాలి మడాల నొప్పి రావడం సర్వసాధారణమైనది. రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో, మెళకువలో కూడా ఉన్నట్టుండి తొడలు, కాలిపిక్కలు పట్టేయడం జరుగుతుంది. ఇలా వచ్చిన నొప్పి కొద్దినిమిషాల వరకు ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత కూడ అక్కడ చేత్తో తాకితే నొప్పి తెలుస్తుంది. ఇలా జరగడానికి కారణం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, థైరాయిడ్ సమస్య ఉన్నా, సరిగా నిద్ర లేకపోయినా, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ ఉన్నా, కండరాల మీద ఒత్తిడి పెరగడం వల్ల ఇలా పట్టేయడం జరుగుతుంది. 
 
అంతేకాదు మన ఒంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తగ్గటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఈ లోపాలను నివారించటానికి కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి.
 
1. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
2. ప్రతిరోజు రెండు పూటలా పాలు త్రాగాలి.
3. ఎప్సెమ్ సాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
4. వీలైనంత ఎక్కువ నీరు తీసుకోవాలి.
5. ఏదైన ఆయిల్ తీసుకొని మసాజ్ చేయడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంతో పాటు ఎక్కువ ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.