శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (14:54 IST)

మీసాలపై బల్లిపడితే ఫలితం ఏంటో తెలుసా?

పురుషులకు మీసాలపై బల్లిపడితే కష్టాలు వెంటాడుతాయని బల్లిశాస్త్రం చెప్తోంది. అలాగే బల్లి పురుషుల తొడలపై పడితే దుస్తులు నాశనమవుతాయట. కాలివేళ్ళపై బల్లి పడితే అనారోగ్య సమస్యలు తప్పవని.. పాదాలపై పడితే ప్రయా

పురుషులకు మీసాలపై బల్లిపడితే కష్టాలు వెంటాడుతాయని బల్లిశాస్త్రం చెప్తోంది. అలాగే బల్లి పురుషుల తొడలపై పడితే దుస్తులు నాశనమవుతాయట. కాలివేళ్ళపై బల్లి పడితే అనారోగ్య సమస్యలు తప్పవని.. పాదాలపై పడితే ప్రయాణానికి సిద్ధంగా వుండాలనే సంకేతాలిస్తున్నట్లు పండితులు అంటున్నారు.

అలాగే ఎడమ భుజంపై బల్లి పడితే పదిమందిలో అగౌరవం జరుగుతుంది. ఇంకా కుడిభుజం.. కష్టాలు, సమస్యలుంటాయి. వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక తప్పదు. 
 
పురుషుల మణికట్టుపై పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది. అలాగే వీపుపై ఎడమ భాగం పడితే విజయం చేకూరుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మాత్రం మృత్యుభయం తప్పదని.. కిందిపెదవిపై పడితే ఆదాయం లాభం కలుగుతుందని.. పై పెదవిపై పడితే కలహాలు తప్పవని బల్లిశాస్త్రం చెప్తోంది.

పురుషుల ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లాభాల బాటపడతారని అర్థం చేసుకోవాలి. కానీ ఎడమ, కుడి కన్నుపై పడితే అశుభ ఫలితాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.