మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (12:37 IST)

ఇంగువతో యవ్వనం.. ఆ నొప్పులను కూడా తగ్గిస్తుందట..

ఇంగువను వంటల్లో చేర్చుకుంటే నిత్యయవ్వనులుగా వుంటారని తెలుస్తోంది. ఇంగువతో చర్మం ముడతలు పడదు. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై వుండే నల్లటి మచ్చలు తొలగిపోతుంది. ఇంగువ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది

ఇంగువను వంటల్లో చేర్చుకుంటే నిత్యయవ్వనులుగా వుంటారని తెలుస్తోంది. ఇంగువతో చర్మం ముడతలు పడదు. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై వుండే నల్లటి మచ్చలు తొలగిపోతుంది. ఇంగువ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కాలుష్యం, ఒత్తిడి వల్ల చర్మం, వెంట్రుకలు పొడిబారుతాయి. ఇంగువ చర్మాన్ని పొడిబారనివ్వకుండా కాపాడుతుంది. 
 
స్కిన్ ఎలర్జీలను ఇంగువ నివారిస్తుంది. ఇంగువతో హెయిర్‌కండిషనింగ్ మాస్కులను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మాస్కు ద్వారా వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి. జుట్టు రాలకుండా వుండాలంటే.. చుండ్రు సమస్య దూరం కావాలంటే ఇంగువను వంటల్లో చేర్చుకోవాలి. జీర్ణకోశ సమస్యలను నివారించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. 
 
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు అడ్డుకట్ట వేస్తుంది. కొలెస్ట్రాల్‌ నిల్వలు శరీరంలో పేరుకుపోకుండా గుండెజబ్బుల నుంచి సంరక్షిస్తుంది. బహిష్టు సమయంలో తలెత్తే నడుమునొప్పి, కడుపునొప్పులను తగ్గిస్తుంది. నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పులు తగ్గిపోతాయి. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి ఒక అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.