సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (10:57 IST)

వేసవిలో దానిమ్మ తీసుకుంటే..?

వేసవిలో దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ముక్యాన్సర్లను నివారిస్తుంది. బరువు పెరగకుండా నియంత్రించుకోవాలన

వేసవిలో దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ముక్యాన్సర్లను నివారిస్తుంది. బరువు పెరగకుండా నియంత్రించుకోవాలనుకునేవారు.. దానిమ్మను రోజుకొకటి తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెజబ్బులను.. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 
 
ఏవైనా గాయాలైనప్పుడు వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేసి, మేని నిగారింపునకు దోహదపడుతుంది. వయసు పెరిగాక వచ్చే ముడతలు, గీతలను నివారిస్తుంది. వయసు పెరుగుదలను తగ్గిస్తుంది. చాలాకాలంపాటు యౌవనంగా ఉండేలా చేస్తుంది. 
 
ఎముకలను పటిష్టంగా ఉంచడంతో పాటు కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలనూ నివారిస్తుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తరుచు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సీన్‌లను బయటికీ పంపవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.